దీపికా- రణ్‌వీర్ క్యూట్ ఫ్యామిలీ.. దిష్టి తగిలేలా ఉందే

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:22 PM

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, పాపులర్ కపుల్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పడుకోణె (Deepika Padukone) ప్రేమ కథ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

DeepVeer

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, పాపులర్ కపుల్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పడుకోణె (Deepika Padukone) ప్రేమ కథ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013 లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్-లీలా సినిమా సెట్స్‌లో ప్రారంభమైన వీరి పరిచయం .. దాదాపు ఆరేళ్ల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణంగా మారి.. పెళ్లి పీటల వరకు వెళ్లింది. పరస్పర గౌరవం, అపారమైన ప్రేమతో నిండిన వీరిద్దరి వివాహం 2018 నవంబర్‌లో ఇటలీలోని అత్యంత అందమైన లేక్ కోమో వేదికగా వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కొంకణి, సింధీ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. వివాహం తర్వాత కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ బాలీవుడ్‌లోనే బెస్ట్ కపుల్‌గా నిలిచారు.


పెళ్లయిన ఆరేళ్ల తర్వాత, ఈ దంపతులు తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. సెప్టెంబర్ 2024లో దీపికా ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తమ పాపాయికి దువా పడుకోణె సింగ్ అని నామకరణం చేసి, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. ఈ చిన్నారి రాకతో వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏడాది క్రితం దువా ముఖాన్ని చూపించిన ఈ జంట.. ఇప్పుడు మరోసారి ఆ చిన్నారి రెండవ పుట్టినరోజున చూపించారు.


ఇప్పుడు ఈ జంట తమ జీవితంలో మరో అద్భుతమైన ఘట్టంలోకి అడుగుపెడుతోంది. దీపికా రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెల్సిందే. దువా రెండవ పుట్టినరోజు వేడుకల సందర్భంలోనే దీపికా తన క్యూట్ మెటర్నిటీ షూట్ ద్వారా తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామనే తీపి కబురును అభిమానులతో అధికారికంగా పంచుకుంది. ఈ శుభవార్తతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రణ్‌వీర్, దువా.. దీపికా బేబీ బంప్ మీద చేతులు వేసి ఉంచడం, తండ్రి చేతిలో బేబీ దువా ఆడుకోవడం లాంటి ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. క్యూట్ ఫ్యామిలీ.. దిష్టి తగిలేలా ఉందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం దీపికా.. అల్లు అర్జున్ సరసన రాకాలో నటిస్తోంది.

Updated Date - Sep 08 , 2026 | 08:22 PM