ఆస్కార్ అకాడమీ ఇన్‌స్టాలో.. దీపిక సీన్ వైరల్!
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:20 AM
దీపిక పదుకోన్ నటించిన ‘యే జవానీ హై దీవానీ’ సినిమాలోని ప్రముఖ సన్నివేశాన్ని ఆస్కార్ అవార్డులను అందించే The Academy తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీపిక పదుకోన్ నటించిన యే జవానీ హై దీవానీ (Yeh Jawani Hai Deewani) సినిమాలోని ఓ క్లిప్‌ని ఆస్కార్ అవార్డులను అందించే ‘ది అకాడమీ’ (The Academy) ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ‘కళ్ల ముందున్న దృశ్యాలను ఆస్వాదించమని మనకు నైనా గుర్తు చేస్తున్నారు’ అంటూ ఆ క్లిప్‌ని పంచుకుంది.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), దీపిక పదుకోన్ (Deepika Padukone) జంటగా నటించిన కల్ట్ సినిమా ‘యే జవానీ హై దీవానీ’. ఇందులో నైనా తల్వార్ పాత్రలో నటించారు దీపిక. ఉన్నచోట సంతోషంగా గడపడం ముఖ్యమని హీరోతో నైనా చెప్పే సన్నివేశానికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. అదే క్లిప్‌ని ‘ది అకాడమీ’ పంచుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.