Deepika Padukone: మరోసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ దీపిక
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:39 PM
బాలీవుడ్ స్టార్ కపుల్ దీప్‌వీర్ (Deepveer) అభిమానులకు మరోసారి శుభవార్త చెప్పారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీప్‌వీర్ (Deepveer) అభిమానులకు శుభవార్త చెప్పారు. దీపికా పడుకోన్ మరోసారి తల్లి కానుంది. ఈ విషయాన్ని ఆమె (Deepika padukone) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తమ కుమార్తె దువా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఆ టెస్ట్ కిట్‌లో పాజిటివ్ రిజల్ట్ కనిపించగా క్యాప్షన్‌లో దృష్టిదోషం ఎమోజీలను మాత్రమే ఉంచారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా, అనన్యా పాండే, సమంత, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్, కరీనా కపూర్, ప్రియా అట్లీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న దీప్‌వీర్ 2024 సెప్టెంబర్ 8న తొలి కుమార్తెకు జన్మనిచ్చారు.