Chiranjeevi: విజయాలకంటే ఆ లక్షణాలే గొప్పవి.. అమితాబ్‌పై చిరంజీవి ఆసక్తికర పోస్ట్‌!

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:17 PM

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు టాలీవుడ్  మెగాస్టార్‌ చిరంజీవి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan) టాలీవుడ్  మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను తనకు ఎంతో ఇష్టమైన గురువుగా చెబుతూ.. ఆయనపై తనకున్న ప్రేమ, గౌరవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

 

“నా ప్రియమైన గురూజీ అమితాబ్‌ బచ్చన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సినిమాపై మీకున్న ప్రేమ, కళ పట్ల మీరు చూపించే గౌరవం ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాయి. మీరు సాధించిన అసాధారణ విజయాలకంటే మించి, మీ ఆప్యాయత, నిరాడంబరత మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందం కలగాలని, మీరు ఇష్టపడే పనిని కొనసాగిస్తూ మరెన్నో చిరస్మరణీయ సంవత్సరాలు గడపాలని కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో, గౌరవంతో.. శుభాకాంక్షలు సర్‌!” అంటూ చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ALSO READ:

Raviteja: రవితేజ 'తులాభారం' మొదలైంది

Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్‌..

రణబాలి ఓవర్సీస్‌.. ఇతర భాషల్లో వెనక్కి వెళ్లినట్టేనా

Aditi Rao Hydari: గ్లామర్‌ ప్రపంచంలోనూ నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా..

Updated Date - Oct 11 , 2026 | 12:33 PM