లెస్బియన్స్‌గా.. రష్మిక, కృతి! షాక్‌లో.. ఫ్యాన్స్
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:28 PM
పుష్పతో శ్రీవల్లిగా మెప్పించినా, యానిమల్ తో గీతాంజలిగా అలరించినా.. తనదైన నటనతో పాన్ ఇండియా రేంజ్‌లో నేషనల్ క్రష్‌గా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రశ్బిక. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక వార్త నెట్టింట ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. తన తదుపరి సినిమాలో రశ్మిక ఒక సరికొత్త, అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపించబోతుందట. అది కూడా ఒక కో-హీరోయిన్‌తో రొమాన్స్ చేసే పాత్ర అని టాక్ వినిపిస్తోంది.
సినిమా రంగం ఇప్పుడు మునుపటిలా లేదు. కథలు మారుతున్నాయి, ప్రేక్షకుల అభిరుచులూ మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ప్రేమ కథలే వెండితెరపై కనిపించేవి. కానీ ఇప్పుడు హ్యూమన్ రిలేషన్ షిప్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సమాజంలో మార్పులకు అనుగుణంగా మేకర్స్ కూడా బోల్డ్ కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నారు. స్వలింగ సంపర్కం లేదా సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్ నేపథ్యంలో సినిమాలు రావడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.
ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తోంది. సుమారు 13 ఏళ్ల క్రితం దీపికా పదుకొనే, సైఫ్ అలీ ఖాన్ నటించిన 'కాక్‌టెయిల్' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు గుర్తుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' రాబోతోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. కృతి సనన్, రశ్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో కృతి సనన్, రశ్మిక మందన్న స్వలింగ ప్రేమికులుగా కనిపించబోతున్నారని బీటౌన్ కోడై కూస్తోంది. లవ్ రంజన్ అందించిన ఈ కథను హోమీ అదజానియా అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.
గతంలో రాజ్‌కుమార్ రావు, భూమి పడ్నేకర్ నటించిన' బదాయి దో' లాంటి చిత్రాలు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. కానీ రశ్మిక లాంటి ఒక టాప్ స్టార్, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలో కృతి, రశ్మికల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మరియు కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇలాంటి రిలేషన్ షిప్స్‌ను నేటి యువత ఎలా రిసీవ్ చేసుకుంటుందనే పాయింట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రశ్మిక మందన్న తన కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పాలి. కథలో కొత్తదనం కోసం ఇలాంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన పర్సటాలిటీని చాటుకుంటోంది. మరి ఈ బోల్డ్ అటెంప్ట్‌తో రష్మిక ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.