Rajesh Khanna: రాజేశ్ ఖన్నా బయోపిక్ బాధ్యత ఎవరిది?
ABN , Publish Date - Apr 23 , 2026 | 02:25 PM
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌లకు (Biopic) మంచి క్రేజ్ ఉంటుంది. వెండితెరపై ఎక్కువశాతం బయోపిక్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా చాలా కాలంగా నడుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌లకు (Biopic) మంచి క్రేజ్ ఉంటుంది. వెండితెరపై ఎక్కువశాతం బయోపిక్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా చాలా కాలంగా నడుస్తోంది. స్టార్‌ల కథల్ని తెరపై చూపించడానికి బాలీవుడ్ మేకర్స్ ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు మరో స్టార్ బయోపిక్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సీనియర్ నటుడు రాజేశ్ ఖన్నా (Rajesh Khanna) బయోపిక్ రానుందనే వార్తలు బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.
భారత దేశ తొలి సూపర్‌స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయనకు ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువ. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాటల్లో చెప్పలేం. అమ్మాయిలైతే ఆయనకు రక్తంతో ప్రేమలేఖలు రాసేవారని చెబుతుంటారు. బాలీవుడ్ ఓ వెలుగు వెలిగిన ఆయన స్టార్‌డమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎన్నో కథనాలు, రూమర్స్ ఆయన చుట్టూ తిరుగుతుండేవి. చివరికి మరణం విషయంలో కూడా ఇప్పటికీ అనుమానమే. ఆయన జీవితంలో కీలక అంశాలన్నింటితో ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. వాటిలో ఓ పుస్తకం ఆధారంగా రాజేశ్ ఖన్నా బయోపిక్ తీయాలనే ఆలోచనలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్. గతంలో దర్శకురాలు ఫరాఖాన్ రాజేశ్‌ఖన్నా బయోపిక్ తీయాలని ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఫరాఖాన్ ఈ ప్రయత్నం చేస్తారా? లేదా మరొకరు ఈ కథను ముందుకు తీసుకెళ్తారా అన్నది చూడాలి. అయితే రాజేశ్ ఖన్నా క్యారెక్టర్ కోసం ఓ యువహీరోని ఓ నిర్మాణ సంస్థ అప్రోచ్ అయిందట. ఆయన నటన, ఇమేజ్, స్టైల్, స్వాగ్‌ను టచ్ చేయడం కష్టమని చెప్పి ఆ యువ హీరో సున్నితంగా తిరస్కిరించారని తెలిసింది. అయితే ఈ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.