Beyond The Kerala Story: ది కేరళ స్టోరీ తెర వెనుక కథేంటి...

ABN , Publish Date - Jan 05 , 2026 | 04:09 PM

రెండేళ్ళ క్రితం వచ్చిన 'ది కేరళ స్టోరీ' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'బియాండ్ ది కేరళ స్టోరీ' రాబోతోంది.

Beyond The Kerala Story

ప్రముఖ నటి అదాశర్మ నాయికగా నటించిన 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) చిత్రం 2023లో విడుదలైన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు... ఆ సినిమా ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాలలో జాతీయ స్థాయిలో అవార్డులనూ గెలుచుకుంది. దర్శకుడు సుదీప్తో సేన్, సినిమాటోగ్రాఫర్ ప్రశాంతను మహాపాత్ర అవార్డులు అందుకున్నారు. 'ది కేరళ స్టోరీ'కి లభించిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ కథను మరింత లోతుగా, మరింత విస్తృతంగా ప్రేక్షకులకు తెలియచేయడం కోసం రచయిత, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా (Vipul Amrutlal Shah) నడుం బిగించారు. ఈ సీక్వెల్ కు 'బియాండ్ ది కేరళ స్టోరీ' (Beyond The Kerala Story) అనే పేరు ఖరారు చేశారు.

vipul.jpg


కేరళలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగానే 'బియాండ్ ది కేరళ స్టోరీ' సీక్వెల్ ను సైతం తెరకెక్కించారు. జాతీయ ఉత్తమ దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఆషిన్ ఎ. షా సహ నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమాను కొత్తవారితో తీశారు. దీన్ని సన్ షైన్ పిక్చర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. దాని ప్రకారం సినిమా ఫిబ్రవరి 27న జనం ముందుకు రానుంది. నిజమైన బాధితుల స్వరాలను ఈ సినిమాలో వినిపించబోతున్నామని, ఎంతో శోధన చేస్తే కానీ బయటపడని సత్యాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం 'బియాండ్ ది కేరళ స్టోరీ'లో చేశామని విపుల్ అమృత్ లాల్ షా తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 04:14 PM