Dhurandhar: దురంధర్ బ్యాన్.. మోదీజీ జోక్యం చేసుకోండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:17 AM

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం దురంధర్ (Dhurandhar) పై పశ్చిమాసియాలో బ్యాన్ ఉన్న సంగతి తెలిసిందే.

Dhurandhar

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం దురంధర్ (Dhurandhar) పై పశ్చిమాసియాలో బ్యాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని కోరుతూ ఇటీవ‌ల‌ నిర్మాతల మండలి లేఖ రాసింది. 'బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలోనూ 'ధురంధర్'పై నిషేధం విధించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.

దీన్ని ఎక్కడైనా విడుదల చేసుకోవచ్చని.. ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. పైన పేర్కొన దేశాల్లో నిషేధం విధించడం మా భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడమే. ఎందుకంటే ఇది భారతీయ సినీ చరిత్రలోని అతి గొప్ప విజయాన్ని అందుకుంది' అని ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ పేర్కొంది.

ఆ గల్ఫ్ దేశాలు మనకు మిత్ర దేశాలు కాబట్టి ఈ చిత్రం విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని మోదీని నిర్మాతల మండలి రిక్వెస్ట్ చేసింది. ఆ దేశాల అధికారులతో చర్చలు జరిపి భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించేలా నిషేధాన్ని వీలైనంత త్వరగా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. రణ్ వీర్‌ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ (Aditya Dhar) తెరకెక్కించిన 'దురంధర్' ఇప్పటికే ఒకే భాషలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

Updated Date - Jan 09 , 2026 | 11:49 AM