బాక్సాఫీస్ వద్ద.. ధురంధర్ సునామీ! రూ. 3వేల కోట్ల క్లబ్‌లో.. చేరిన తొలి ఇండియన్ ఫ్రాంచైజీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:41 AM
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ధురంధర్ ఫ్రాంచైజీ పెను సంచలనం సృష్టించింది.
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ధురంధర్ (Dhurandhar) ఫ్రాంచైజీ పెను సంచలనం సృష్టించింది. రూ.3 వేల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా సరికొత్త రికార్డును లిఖించింది.
హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh), ఆదిత్యధర్ (Aditya Dhar) కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ వసూళ్ల పరంగా అజేయంగా దూసుకు పోతోంది.
ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.3 వేల కోట్లకు పైబడి వసూళ్లను సాధించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంచైజీలుగా ఉన్న 'బాహుబలి' (రూ. 2438 కోట్లు), పుష్ప (రూ.2092 కోట్లు) రికార్డులను 'ధురంధర్' అధిగమించింది.
'దురంధర్ 1' రూ.1,307 కోట్లు, 'ధురంధర్: ది రివెంజ్ 2' ఇప్పటికి రూ.1712 కోట్ల వసూళ్లను సాధించాయి. చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోంది.