Arijit Singh: షాకింగ్.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ సింగర్

ABN , Publish Date - Jan 27 , 2026 | 10:13 PM

సంగీత అభిమానులకు సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) బ్యాడ్ న్యూస్ చెప్పారు. తాను ప్లే బ్యాక్ సింగర్ గా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.

Arijit Singh

Arijit Singh: సంగీత అభిమానులకు సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) బ్యాడ్ న్యూస్ చెప్పారు. తాను ప్లే బ్యాక్ సింగర్ గా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ లో అర్జిత్ అధికారికంగా తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ పెట్టారు. 'హలో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్ని సంవత్సరాలు.. శ్రోతలుగా నాకు ఇంత ప్రేమను అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి నేను ప్లేబ్యాక్ సింగర్ గా కొత్త ప్రాజెక్ట్స్ ను చేపట్టబోనని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. ప్లే బ్యాక్ సింగర్ గా నా జర్నీని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం' అంటూ చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సడెన్ గా అర్జిత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లోనే కాకుండా ఎక్స్ లో కూడా అర్జిత్ సింగ్ కొన్ని పోస్టులు చేశారు. 'దేవుడు నా పట్ల నిజంగా దయ చూపాడు. భవిష్యత్తులో నేనొక మంచి కళాకారుడిని అనిపించుకుంటాను. మీ అందరి సపోర్ట్ కి నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొన్ని పెండింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఫినిష్ చేస్తున్నాను. ఈ ఏడాదిలో అవి మీరు వినొచ్చు' అని తెలిపారు. అర్జిత్ రిటైర్మెంట్ గురించి తెలిసిన సంగీత అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దని, అర్జిత్ ని తిరిగి రమ్మని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.

అర్జిత్ సింగ్.. భారతదేశంలోనే ప్రముఖ సింగర్స్ లో ఒకరు. 2005లో, ఫేమ్ గురుకుల్‌ రియాలిటీ షోలో పాల్గొని గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత నెమ్మదిగా సినిమాల్లో సింగర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో పాటలను పాడారు. తెలుగులో ఆయన గాత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్వామి రారా, మనం, కేశవ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హుషారు, బ్రహ్మాస్త సినిమాల్లో హిట్ సాంగ్స్ ను ఆలపించారు.

Updated Date - Jan 27 , 2026 | 10:13 PM