Ananya Panday: అది భరతనాట్యమా.. బురద నాట్యమా.. సిగ్గులేదు

ABN , Publish Date - May 25 , 2026 | 06:04 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యపాండే (Ananya Pandey) సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం.. ట్రోలర్స్ అలా విరుచుకుపడుతుంటారు. అంటే, ఆమె ఆ ఛాన్స్ ట్రోలర్స్ కి ఇవ్వడంలో ఏ మాత్రం మొహమాటపడదు.

Ananya Pandey

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యపాండే (Ananya Panday) సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం.. ట్రోలర్స్ అలా విరుచుకుపడుతుంటారు. అంటే, ఆమె ఆ ఛాన్స్ ట్రోలర్స్ కి ఇవ్వడంలో ఏ మాత్రం మొహమాటపడదు. సినిమాల కంటే ఎక్కువ అనన్య ఇలా ట్రోల్స్ వలనే బాగా అగుర్తింపు తెచ్చుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగువారికి కూడా ఈ చిన్నది సుపరిచితమే. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ద్వారా అనన్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అమ్మడు ఫొటోస్, సాంగ్స్ చూసి అబ్బా టాలీవుడ్ లో సెటిల్ అయ్యేలానే ఉంది అనుకున్నారు. కానీ, లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని చిన్నదాన్ని మరోసారి టాలీవుడ్ వైపే తొంగి చూడకుండా చేసింది.


ఇక విజయాపజవలను పక్కన పెట్టి బాలీవుడ్ లోనే అనన్య వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం చాంద్ మేరా దిల్. కిల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన లక్ష్య చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో హీరోగా నటించాడు. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చాంద్ మేరా దిల్. ఇక ఈ సినిమాలో అనన్య చేసిన ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేయడమే కాదు.. బాలీవుడ్ మొత్తాన్ని విమర్శల పాలు అయ్యేలా చేస్తోంది.


ఈ సినిమాలో అనన్య.. హీరోని మెప్పించడానికి స్టేజ్ పై భరతనాట్యం చేస్తోంది. ఇండియాలో భరతనాట్యం ఎంత సాంప్రదాయకమైన నృత్యమో అందరికీ తెలుసు. ఇప్పుడు అనన్య.. ఆ డ్యాన్స్ నే అవహేళన చేసింది. భరతనాట్యం కాస్ట్యూమ్ లో ఆధునిక హిప్-హాప్, కాంటెంపరరీ స్టైల్స్ కలిపిన ఒక ఫ్యూజన్ డ్యాన్స్ స్టెప్స్ వేసింది. అంతేకాకుండా భంగిమలను రోబోలాగా చేస్తూ వింత వింత ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో నెటిజన్స్.. అమ్మడిని ఏకిపారేస్తున్నారు. అసలు నీకు సిగ్గుందా.. వెనుక నటరాజ స్వామి విగ్రహం పెట్టుకొని.. ఏంటా డ్యాన్స్ అని కొందరు.. అది భరతనాట్యమా.. బురద నాట్యమా.. బాలీవుడ్ అంతా ఇంతే అని మండిపడుతున్నారు. ఇంకొందరు అనన్యకు సపోర్ట్ గా నిలిచారు. ఆమె మాత్రం ఏం చేస్తోంది... కొరియోగ్రాఫర్ చెప్పింది చేసిందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా వింతైన డ్యాన్స్ తో లైగర్ భామ భయపడుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - May 25 , 2026 | 06:19 PM