Amitabh Bachchan: అమితాబ్‌కు శస్త్రచికిత్స.. ఆందోళనలో అభిమానులు
ABN , Publish Date - Jul 21 , 2026 | 02:24 PM
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై మరోసారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై మరోసారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 83 ఏళ్ల వయసులో కూడా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాల్సి వచ్చిందని బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు జరిగింది? ఎందుకు అనే వివరాలను వెల్లడించలేదు. ఆసుపత్రిలో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'శస్త్రచికిత్స... ఐసీయూలో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సంరక్షణ... ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడం' అని పోస్ట్ లో పేర్కొన్నారు. ఆయన పోస్ట్ లో మరో అంశం అభిమానులను మరింత భావోద్వేగానికి గురి చేసింది.
'ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాకే అసలు సవాళ్లు మొదలవుతాయి. శారీరకంగా, మానసికంగా కోలుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. జీవితంలో ఎంతటి విజేత అయినా ఒక దశలో బలహీనతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు ధైర్యంగా దాన్ని అధిగమిస్తారు.. మరికొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'బిగ్‌బీ త్వరగా కోలుకోవాలి, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి' అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన 'కల్కి 2898 ఎ.డి.' సీక్వెల్‌తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది
రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..
Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా