జయా బచ్చన్‌కు అసలు టైమ్ చెప్పని అమితాబ్.. బిగ్‌బీ ఫన్నీ ట్రిక్ ఇదే!
ABN , Publish Date - Sep 14 , 2026 | 02:47 PM
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) సినిమాలతోనే కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాలతోనే కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ముఖ్యంగా భార్య జయా బచ్చన్‌తో తన అనుబంధం గురించి ఆయన చెప్పే విషయాలు సరదాగా, ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్ వెల్లడించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. జయా బచ్చన్ సమయానికి సిద్ధం కావడానికి తాను అనుసరించే ప్రత్యేకమైన పద్ధతి గురించి బిగ్‌బీ చెప్పారు. ఏదైనా ఫంక్షన్, ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిజమైన సమయాన్ని కాకుండా.. ఓ గంట ముంది అని చెబుతాను అని వెల్లడించారు. ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటే.. జయాకు మాత్రం 5 గంటలకే బయలుదేరాలని చెబుతాను. దీంతో ఆమె ముందుగానే రెడీ అవ్వడం ప్రారంభిస్తారని, చివరకు తాము అనుకున్న సమయానికి ఈవెంట్‌కు చేరుకోగలుగుతామని అమితాబ్ నవ్వుతూ వివరించారు. ఆడాళ్ళు సమయానికి రెడీ కావాలంటే ఈ ‘టెక్నిక్’ వాడాల్సిందే అని బిగ్ బీ చెప్పారు. మరో విషయంపై కూడా ఆయన స్పందించారు.
"షూటింగ్ కారణంగా నేను ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చినపుడు ముందుగానే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. ఉదయాన్నే అందరికీ నమస్కారం చెబుతూ.. ఆ రోజు షూటింగ్ ఉండటంతో ఇంటికి రావడం ఆలస్యమవుతుందని, డిన్నర్ కోసం ఎదురుచూడొద్దని ముందే చెప్పేస్తాను. ఇలా ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల ఇంటికి వెళ్లిన తర్వాత వచ్చే కోపం నుంచి కొంతవరకు తప్పించుకోగలను. ఒకవేళ ముందుగా చెప్పడం మర్చిపోతే మాత్రం.. జయా నుంచి చివాట్లు తప్పవు’’ అని అమితాబ్ బచ్చన్ సరదాగా చెప్పారు.