ఆల్ఫా రిలీజ్ డేట్ వచ్చేసింది!

ABN , Publish Date - Mar 09 , 2026 | 07:13 PM

ఆల్ఫా చిత్రం కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జూలై 10న ఈ సినిమాను యశ్‌ రాజ్ ఫిలిమ్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతోంది.

Alpha Movie

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న 'ఆల్ఫా' (Alpha) సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో అలియా భట్ (Aliaa bhatt) , శర్వరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేస్తూ, వైఆర్ఎఫ్‌ బ్యానర్, అలియా భట్, శర్వరి తమ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో అలియా భట్ ముఖం మీద గాయాలు, గాట్లు కనిపిస్తున్నాయి.


అలియా, శర్వరితో పాటు ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ సైతం కీలక పాత్రలు పోషించారు. ఇందులో అలియా, శర్వరి కలిసి బాబీ డియోల్ ను ఢీ కొట్టబోతున్నారని తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్‌లో అలియా భట్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను 'ది రైల్వే మెన్' హిట్ సీరిస్ ను తెరకెక్కించిన శివ్ రవైల్ రూపొందిస్తున్నారు. దీనికి ఆదిత్య చోప్రా నిర్మాత.

Updated Date - Mar 09 , 2026 | 07:19 PM