అలియా భట్ ఫెయిల్‌ అయ్యింది!

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:11 PM

అలియా భట్ తొలిసారి 'హోస్ట్'గా వ్యవహరించిన 'స్క్రీన్ అవార్డ్స్' వేడుక ఎలా సాగినా, ఆమె మాత్రం అబాసు పాలయ్యారు. ఆ విషయాన్ని అలియా కూడా గ్రహించినట్టే ఉన్నారు. ఎందుకంటే ఫంక్షన్ తరువాత అలియా చాలా ముభావంగా కనిపించారు.

Alia Bhatt

వెండితెరపై వెలిగిపోవడమే కాదు, ఆ తరువాత కొన్ని సందర్భాల్లోనూ వెలగాలని ఆశిస్తూంటారు స్టార్స్. ముఖ్యంగా అందాల భామలు నటనతోనే కాదు, తమ వ్యాఖ్యానంతోనూ మురిపించే ప్రయత్నం చేస్తూంటారు. ముఖ్యంగా బాలీవుడ్ (Bollywood) లో కొందరు అందాల తారలు 'హోస్ట్'గానూ బెస్ట్ అనిపించుకున్నారు. ఆ పంథాలోనే పయనించాలని రణబీర్ కపూర్ పత్ని అలియా భట్ (Alia Bhatt) పరితపించింది. ఆమె తపనకు తగ్గట్టుగా 'స్క్రీన్ అవార్డ్స్ -2026' వేడుకలో హోస్ట్ గా అలియా భట్ వ్యవహరించారు. ఆ వేదికపై ఆమెకు పార్ట్ నర్ గా సునీల్ గ్రోవర్ సాగారు. అంతా బాగానే ఉంది. కానీ, తొలిసారి ఓ పబ్లిక్ ఫంక్షన్ కు యాంకరింగ్ చేయడం వల్ల అందాలభామ అలియా అటు ఇటుగా, ఇటు అటుగా విషయాలను పలికి ప్రేక్షకులకు పిచ్చెక్కించారు.

మరి అలియాకు ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో? అందులోని వివరాలను ఎలా పొందుపరిచారో? తెలియదు కానీ, యాంకరింగ్ చేయడంలో మాత్రం ఆమె అవస్థలు పడ్డారు. ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ గురించి చెబుతూ ఆయన రూపొందించిన కొన్ని చిత్రాలు విడుదలైన సంవత్సరాలను తప్పుగా వల్లించారు. దానిని కవర్ చేసుకుంటూ నవ్వులు పూయించే ప్రయత్నం చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యారు అలియా. అలా అలియా భట్ తొలిసారి 'హోస్ట్'గా వ్యవహరించిన 'స్క్రీన్ అవార్డ్స్' వేడుక ఎలా సాగినా, ఆమె మాత్రం అబాసు పాలయ్యారు. ఆ విషయాన్ని అలియా కూడా గ్రహించినట్టే ఉన్నారు. ఎందుకంటే ఫంక్షన్ తరువాత అలియా చాలా ముభావంగా కనిపించారు.

Updated Date - Apr 08 , 2026 | 05:17 PM