అలియా భ‌ట్‌కు.. అరుదైన ఘనత

ABN , Publish Date - Feb 18 , 2026 | 07:55 AM

బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

Alia Bhatt

బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక మైన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాప్తా) 79వ ఎడిషన్ (BAFTA Awards 2026) అవార్డుల కార్యక్రమంలో ప్రజంటర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర హాలీవుడ్ నటులతో పాటు ఆమె కూడా విజేతలకు పురస్కారాలను అందించనున్నారు. మన దేశం నుంచి దీపిక పదుకొణే, ప్రియాంక చోప్రా తర్వాత ఈ ఘనత సాధించిన నటి అలియానే కావడం విశేషం. ఈనెల 22న లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ వేడుక జరగనుంది.

Updated Date - Feb 18 , 2026 | 10:28 AM