కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ బచ్చన్.. ఆమె ధరించిన గౌన్ ప్రత్యేకత ఏంటో తెలుసా

ABN , Publish Date - May 23 , 2026 | 03:09 PM

ఫ్రాన్స్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరుకుంది. గత రెండు దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై తనదైన శైలిలో మెరుస్తోన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)..

Aishwarya Rai

ఫ్రాన్స్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరుకుంది. గత రెండు దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై తనదైన శైలిలో మెరుస్తోన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan).. ఈ ఏడాది కూడా ఒక అద్భుతమైన వినూత్న గౌన్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈసారి ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన లుమినారా డ్రెస్ లో సెంట్రయఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.


లుమినారా అని పిలిచే డీప్ సఫైర్ బ్లూ మెటాలిక్ గౌన్‌లో ఐశ్వర్య కళ్ళు జిగేల్ అనేలా మెరిసింది. నీలి రంగు దుస్తుల్లో.. లూజ్ హెయిర్, మినిమల్ మేకప్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే, ఆకాశం నుండి దేవకన్య దిగివచ్చిందా అనేలా అభిమానులు ఫిదా అయ్యారు. కేవలం ఐశ్వర్య కోసమే అమిత్ ఈ గౌన్ ని తయారు చేశాడు. ఈ సరికొత్త మెటాలిక్ స్ట్రక్చర్డ్ గౌన్‌ను తయారు చేయడానికి ఏకంగా 1500 గంటల సమయం పట్టిందట. ఎంతో సంక్లిష్టమైన హ్యాండ్‌క్రాఫ్ట్ వర్క్ మరియు మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి డిజైనర్ బృందం దీనిని రాత్రింబగళ్లు కష్టపడి రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మెటీరియల్ ని అమిత్ అగర్వాల్ సిగ్నేచర్ స్టైల్ అయిన రీసైకిల్డ్ పాలిమర్ ఫైబర్స్‌ను ఉపయోగించి తయారుచేశాడట. ఈ గౌన్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెలుగు పడినప్పుడు ఈ గౌన్ ఒక ప్రత్యేకమైన కాంతితో మెరుస్తుంది.


ఇక ఈ డిజైనర్ గౌన్ గురించి అమిత్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి గ్లోబల్ ఐకాన్ కోసం ఈ గౌన్‌ను డిజైన్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఈసారి ఆమెను ఒక నిజమైన క్వీన్ లా ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి ఈ లుమినారా లుక్‌ను డిజైన్ చేశాం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలోవైరల్ గా మారాయి.

Updated Date - May 23 , 2026 | 03:23 PM