ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో సిస్టర్‌లా బాండింగ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:47 PM
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) మరోసారి తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేశారు.
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) మరోసారి తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేశారు. హాలీవుడ్ నటి సిమోన్ యాష్లీతో (Simone Ashley) కలిసి పంచుకున్న ఆత్మీయ క్షణాలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లోరియల్ ప్యారిస్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో కలుసుకున్న ఈ ఇద్దరు తారలు ఆప్యాయంగా పలకరించుకోవడమే కాకుండా, చివర్లో చేతులు పట్టుకుని కలిసి ర్యాంప్ వాక్ చేయడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో ముగింపు తర్వాత జరిగిన ఫైనల్ ర్యాంప్ వాక్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. చేతులు పట్టుకుని ర్యాంప్‌పై నడుస్తూ నవ్వులు చిందించిన వీరి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఐశ్వర్య, సిమోన్ మధ్య కనిపించిన స్నేహపూర్వక అనుబంధం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సిమోన్ యాష్లీకి భారతదేశంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమిళనాడు మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు భారతీయ సంస్కృతితోనూ పరిచయం ఉంది. మరోవైపు ఐశ్వర్యారాయ్, సిమోన్ ఇద్దరూ లోరియల్ ప్యారిస్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుంటారు.