ఎట్టకేలకు 60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్.. ఎలాగో తెలుసా
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:56 PM
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా సల్మాన్ ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. గతంలో సంగీతా బిజ్లానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ వంటి తారలతో ఆయన నడిపిన ప్రేమకథలు బాలీవుడ్‌లో ఎంతగానో చర్చనీయాంశమయ్యాయి. పెళ్లిపీటల వరకు వెళ్లి ఆగిపోయిన ఆయన వివాహ బంధంపై ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వలన జరిగింది.
ఈమధ్య ఏఐ పెళ్లి వీడియోలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ టామ్ హలండ్, జెండయా ఏఐ పెళ్లి వేడుక ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఏఐ ద్వారా సల్మాన్ ఖాన్‌కు అత్యంత అట్టహాసంగా పెళ్లి జరిగింది. ఈ వీడియోలో పెళ్లికూతురు ముఖాన్ని ఎవరికీ కనిపించకుండా మల్లెపూల దండలతో మూసి ఉంచడం విశేషం. ఈ అపూర్వ వివాహ మహోత్సవానికి భారతీయ చిత్రసీమలోని తారల ప్రపంచమంతా కదిలి వచ్చినట్లు ఏఐ సాంకేతికత ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ ఏఐ పెళ్లి వీడియోలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్‌లు సన్నాయి వాయిస్తుండగా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు అదిరిపోయే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇక దక్షిణాది చిత్రసీమ నుంచి టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్‌లతో పాటు కోలీవుడ్, మోలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలు ఈ పెళ్లికి హాజరై సల్మాన్‌ను ఆశీర్వదిస్తున్నట్లు చూపించారు.
వీడియో చివర్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. రియాలిటీకి చాలా దగ్గరగా, ఎంతో క్రియేటివ్‌గా ఉన్న ఈ ఏఐ వీడియోను చూసి నెటిజన్లు, సల్మాన్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఏదేమైనా చివరకు సల్మాన్ పెళ్లి ఇలా అయినా చూశాం సంతోషం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.