Malaika Arora: కొత్త బాయ్ ఫ్రెండ్.. 50 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే ..  

ABN , Publish Date - Jul 27 , 2026 | 10:01 AM

మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ఐదు పదుల వయసులోనూ బాలీవుడ్‌ నుంచి సౌత్‌ వరకు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే గ్లామర్‌తో అందరినీ కట్టిపడేస్తుందీ ముద్దుగుమ్మ.

మలైకా అరోరా(Malaika Arora).. పరిచయం అక్కర్లేని పేరు. ఐదు పదుల వయసులోనూ బాలీవుడ్‌ నుంచి సౌత్‌ వరకు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే గ్లామర్‌తో అందరినీ కట్టిపడేస్తుందీ ముద్దుగుమ్మ. కెరీర్‌లో సినిమాల కంటే ఎక్కువగా గ్లామరస్‌ ఫోటోషూట్‌లు, ప్రేమ వ్యవహారాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. నటుడు అర్జున్‌ కపూర్‌తో (Arjun kapoor) కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ బ్యూటీ, ఇటీవల అతనితో బ్రేకప్‌ చెప్పేసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరిచిపోకముందే ఇప్పుడు మలైకా కొత్త ప్రేమకథ బాలీవుడ్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Harsh Mehtha.webp
అర్జున్ కపూర్ తర్వాత కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న ఈ గ్లామర్ క్వీన్, ఇప్పుడు ప్రముఖ డైమండ్‌ మర్చంట్‌ హర్ష్‌ మెహతాతో (Harsh Mehta) డేటింగ్‌లో ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరి డేటింగ్ రూమర్లకు బలం చేకూరుస్తూ ఇటీవల కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ మ్యూజిక్‌ కన్సర్ట్‌లలోనూ, ఎయిర్‌పోర్ట్‌లోనూ వీళ్లిద్దరూ ఒకే చోట కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. వీరు ఒకే ఫ్రేమ్‌లో నేరుగా కెమెరాల ముందుకు రాకపోయినప్పటికీ, ఒకే ప్రాంతంలో దాదాపు ఒకే సమయంలో కనిపించడంతో బి-టౌన్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మలైకా తన కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ తో పాటు అతికొద్ది మంది సన్నిహితులతో కలిసి ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైంది. ఆశ్చర్యకరంగా ఈ ఈవెంట్‌లో హర్ష్‌ మెహతా కూడా సందడి చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దాంతో వీళ్లిద్దరి రిలేషన్‌షిప్‌ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

Malaina 2.webp

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరూ తమ బంధాన్ని చాలా ప్రైవేట్‌గా, ఎవరికీ తెలియకుండా మెయిన్‌టెయిన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ, పాపరాజీల కంట పడకుండా ఉండటం బాలీవుడ్ సెలబ్రిటీలకు సాధ్యమయ్యే పని కాదు కదా. ఎంత దాచాలని చూసినా, వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. మలైకా అరోరా ఎల్లప్పుడూ తన పర్సనల్ లైఫ్‌ను ఓపెన్‌గానే ఉంచుతుందని పేరుంది. మరి ఈ కొత్త ప్రేమాయణంపై, హర్ష్‌ మెహతాతో ఉన్న సంబంధంపై ఆమె ఎప్పుడు నోరు విప్పుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ రూమర్డ్‌ కపుల్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - Jul 27 , 2026 | 10:07 AM