Rhea Chakraborty: ఏడేళ్ల తర్వాత సుశాంత్ ప్రేయసి రీఎంట్రీ
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:46 AM
తెలుగులో ఎమ్మెస్ రాజు తూనీగ తూనీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అటుపై బాలీవుడ్‌కు వెళ్లి పోయింది ముద్దుగుమ్మ రియా చక్రవర్తి .
తెలుగులో ఎమ్మెస్ రాజు తూనీగ తూనీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అటుపై బాలీవుడ్‌కు వెళ్లి పోయింది ముద్దుగుమ్మ రియా చక్రవర్తి (Rhea Chakraborty). అక్కడ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు నేపథ్యంలో ఆయన ప్రియురాలు అయిన రియా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, జైలుకు సైతం వెళ్లడం జరిగింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన దర్యాప్తు, న్యాయపరమైన పరిణామాల తర్వాత ఆమె మరలా సినీ రంగంలోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయింది.
ఈ క్రమంలో.. గత ఏడాది నుంచి కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించిన రియా, ఇప్పుడు వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తోంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టిన ఆనందాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి నటి కావాలనే కలతో 17 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి ఉత్సాహమే ఇప్పటికీ తనలో ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రియా చక్రవర్తి ‘ఫ్యామిలీ బిజినెస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోండగా ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం తనకు ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని రియా తెలిపింది. ఈ సందర్భంగా రియా చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఎన్నో సవాళ్ల మధ్య కూడా నా ధైర్యమే నన్ను నిలబెట్టింది. మళ్లీ కెమెరా ముందుకు రావడం నమ్మలేని అనుభూతి” అని ఆమె పేర్కొంది. అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రీ ఎంట్రీకి బెస్టాప్ లక్ చెబుతున్నారు.