కరణ్ జోహార్ బిగ్ షాక్.. 'కాఫీ విత్ కరణ్' క్లోజ్

ABN , Publish Date - Sep 30 , 2026 | 07:03 PM

కాఫీ విత్ కరణ్ ఈ టాక్ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను బయటకు లాగి ఎన్నోసార్లు ఈ షో వివాదాలకు దారితీసింది.

Koffee With Karan

కాఫీ విత్ కరణ్ ఈ టాక్ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను బయటకు లాగి ఎన్నోసార్లు ఈ షో వివాదాలకు దారితీసింది. గడిచిన రెండు దశాబ్దాలుగా భారతీయ సినీ అభిమానులను అలరిస్తూ సంచలనం సృష్టించిన పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) ముగింపు దశకు చేరుకుంది. ఈ షో చివరి సీజన్‌ను అధికారికంగా ప్రకటిస్తూ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు.


2004లో ప్రారంభమైన ఈ ఐకానిక్ షో ఇప్పటివరకు 8 సీజన్లు, 161 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇండియన్ పాప్ కల్చర్‌ను, బాలీవుడ్ గాసిప్స్‌ను శాసించడంలో కాఫీ విత్ కరణ్ వహించిన పాత్ర సామాన్యమైనది కాదు. స్టార్ల మధ్య లవ్ ఎఫైర్స్, విభేదాలు, నెపోటిజమ్ కాంట్రవర్సీలు, నెట్టింట మీమ్స్ ట్రెండ్స్.. ఇలా ప్రతీ సీజన్‌లో ఏదో ఒక ఎపిసోడ్ ఇండియన్ మీడియాలో సంచలనం సృష్టిస్తూనే వచ్చింది. ఇక ఈ షో ముగింపు దశకు చేరుకుందని కరణ్ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ షో ముగించడానికి కారణం.. కరణ్, డైరక్షన్ మీదనే ఫోకస్ చేయాలనుకోవడమే అని తెలుస్తోంది.


ఈ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత, కరణ్ జోహార్ మళ్లీ పూర్తి స్థాయిలో మెగాఫోన్ పట్టి తనకు ఎంతో ఇష్టమైన దర్శకత్వ బాధ్యతల్లోకి అడుగుపెట్టబోతున్నాడట. తాజా ప్రకటన ప్రకారం.. రాబోయే ఈ ఫైనల్ సీజన్ ను మునుపెన్నడూ లేని విధంగా అన్‌ఫిల్టర్డ్ కన్వర్జేషన్స్, ఊహించని సెలబ్రిటీ గెస్టులు, మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్లతో ఒక గ్రాండ్ బ్లాక్‌బస్టర్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కూడా ఈ షోకు గెస్టులుగా వెళ్లనున్నారట. దీంతో ఈ షోపై అటు బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. అక్టోబర్ 14 నుంచి హాట్ స్టార్ స్పెషల్స్ లో కాఫీ విత్ కరణ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ లాస్ట్ సీజన్ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.

Updated Date - Sep 30 , 2026 | 07:03 PM