అభిమానికి.. ముద్దు పెట్టిన తమన్నా! వీడియో వైరల్
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:47 AM
హీరోయిన్ తమన్నా భాటియా తన అభిమానికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు.
హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తన అభిమానికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు తమన్నా. స్త్రీ 2 చిత్రంలో ఆమె నర్తించిన ప్రత్యేక గీతం ‘ఆజ్ కీ రాత్’ కు వేదికపై డాన్సర్స్ గ్రూప్ అద్భుతంగా న ర్తించింది. వారిని అభినందించేందుకు వేదికపైకి వచ్చిన తమన్నా వారితో కలసి సరదాగా స్టెప్పులేశారు.
ఆ బృందంలో ఒక యువతి తమన్నాను ‘మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా’ అని అడగ్గా ఆమె చిరునవ్వుతో అంగీకరించారు. దాంతో ఆ అభిమాని తమన్నా బుగ్గను ముద్దాడారు. ఆమె ప్రేమకు మురిసిపోయిన తమన్నా ఆ యువతిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని ముద్దుపెట్టారు.
ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయింది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి, ఎలాంటి గర్వం లేకుండా అభిమానిని ముద్దాడిన తమన్నాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.