పాట పాడి ప్రేక్షకులను.. భక్తి పారవశ్యంలో ముంచెత్తిన హీరోయిన్
ABN , Publish Date - Feb 16 , 2026 | 07:21 AM
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతో విశేష ఆదరణ పొందిన రాశీ ఖన్నా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతో విశేష ఆదరణ పొందిన రాశీ ఖన్నా (Raashii Khanna).. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆమె ‘శివ కైలాషోం కే వాసీ’ (Shiv Kailashon Ke Waasi) అంటూ ఓ ప్రత్యేక గీతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించి పరమేశ్వరుడికి తన వంతు స్వర నీరాజనం అర్పించారు.
ఈ గీతానికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తన ఛానల్‌లో పోస్టు చేశారు. ‘ఈ పవిత్రమైన రోజున అచంచలమైన విశ్వాసం, శరణాగతి, కృతజ్ఞతా భావంతో నేను ఆలపించిన ‘శివ కైలాషోం కే వాసీ’ గీతాన్ని ఆ మహాదేవుడికి నా ప్రార్థనగా సమర్పిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. రాశీ గాత్ర మాధుర్యం అభిమానులను, ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మీరూ ఈ పాట ఓసారి విని పరవశించండి.