Mrunal Thakur: రాళ్లు వేసినా.. పూలు చల్లినా నా ప్రయాణం ఆగదు
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:08 PM
తన సినీ ప్రయాణంపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన ప్రయాణం నదీ ప్రవాహం వంటిదని. అందులో రాళ్ళు వేసిన, పూలు చేసినా తన ప్రవాహం ఆగదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అన్నారు. తాజాగా తన సినీ జర్నీపై ఆమె స్పందించారు. 'చిన్న వయసు నుంచే సినిమాపై అమితమైన ఆసక్తి, సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక ఉండేది. బుల్లితెరపై నటించే సమయంలోనే సినిమా నటిలా కష్టపడ్డాను.
ఒక రోజు ఉన్నట్టుండి సినిమా అవకాశం వచ్చింది.. దాన్ని అట్టే ఒడిసిపట్టుకున్నాను. ఆ సినిమా అవకాశం పేరుతోపాటు గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టింది. నటుల కంటే నటీమణులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేందుకు ఒక ముఠా ఉంది. ఎప్పుడు తప్పు చేస్తారా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తోంది. ఈ విషయం హీరోయిన్లకు బాగా తెలుసు.

నాపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇలా విమర్శలు చేసే వారికి నేను చెప్పేది ఒక్కటే.. నేను నదీ ప్రవాహం లాంటిదాన్ని, అందులో రాళ్ళువేసినా, పూలు చల్లినా నా ప్రయాణం మాత్రం ఆగదు. సినిమా అనేక విష యాలు నేర్పింది. ఎన్ని రకాలైన విమర్శలు బాణాలుగా సంధించినా 'ఐ డోంట్ కేర్ అంటూ పేర్కొన్నారు.