‘ధురంధర్‌: ద రివెంజ్‌’: ఆ పాత్రను ముగ్గురు స్టార్లు తిరస్కరించారు

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:14 PM

బాలీవుడ్‌ చిత్రం ‘ధురంధర్‌: ద రివెంజ్‌’ (Dhurandhar 2) చిత్రం సెన్సేషన్‌ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా 1500 కోట్లు వసూళ్లు రాబట్టింది.

బాలీవుడ్‌ చిత్రం ‘ధురంధర్‌: ద రివెంజ్‌’ (Dhurandhar 2) చిత్రం సెన్సేషన్‌ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా 1500 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇంకా థియేటర్‌లలో సినిమా జోరు ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో కీలకమైన పాత్ర రెహ్మాన్‌ డకాయిట్‌ది. ఈ పాత్రను అక్షయ్‌ ఖన్నా (Akshay Khanna) పోషించారు. అయితే తొలుత ఈ పాత్రను చాలామంది నటులు తిరస్కరించారట. ఈ విషయం గురించి క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ ఛాబ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రెహమాన్‌ డకాయిట్‌ పాత్రను ముగ్గురు నటులు తిరస్కరించారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన స్టార్‌ కాగా, మరో ఇద్దరు బాలీవుడ్‌ నటులు. ఫైనల్‌గా ఈ పాత్ర  అక్షయ్‌ ఖన్నాను వరించింది. ఈ కథ మొత్తం రణ్‌వీర్‌సింగ్‌ చుట్టూ తిరిగేది కావడం, మల్టీస్టారర్‌ అవ్వడంతో ఆయా నటులు ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు. అయితే ఆ నటులు ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ సినిమా విడుదల అయినా తర్వాత ఆ క్యారెక్టర్‌ చూసి ‘ఈ పాత్రను మిస్‌ అయ్యామే అని తిరస్కరించిన నటులు రిగ్రెట్‌ అవుతారు’ అని ముఖేష్‌ అన్నారు. సౌత్‌ నుంచి తిరస్కరించిన నటుడు నాగార్జున అని టాక్‌ నడుస్తోంది. అలాగే ఇందులో సారా అర్జున్‌ పోషించిన యెలినా పాత్ర కోసం 1000 మందిని ఆడిషన్‌ చేసినట్లు చెప్పారు.


 

Updated Date - Apr 04 , 2026 | 03:28 PM