Aamir Khan: ఆమిర్‌ఖాన్.. గౌరీ స్ప్రాట్ ఒకటయ్యారు..
ABN , Publish Date - Jul 05 , 2026 | 02:49 PM
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ (Aamir khan) ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ (Aamir khan) ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ తో పాతికేళ్ల నాటి స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. 61 ఏళ్ల వయసులో ఆయన వివాహం చేసుకున్నారు. బాంద్రాలోని నివాసంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా మ.12.45 గంటలకు మ్యారేజ్ పేపర్స్ పై సంతకాలు చేశారు. కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమిర్ టీం సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆమిర్‌ఖాన్ కజిన్ నుజహత్‌ఖాన్ ద్వారా 25 ఏళ్ల క్రితమే గౌరికి ఆమిర్‌తో పరిచయం ఏర్పడింది. సుదీర్ఘకాలం మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ గతేడాది మార్చిలో ఆమిర్ 60వ పుట్టిన రోజు సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌ను ప్రపంచానికి ప్రకటించారు. ఏడాది కాలంగా బాంద్రాలోని అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్న ఈ జంట.. చివరికి వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకుంది.