Aamir Khan: ఏం గుండె అయ్యా నీది.. ముగ్గురు భార్యలతో ఒకే కారులో

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:31 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే అని మరోసారి నిరూపించాడు.

Aamir Khan

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే అని మరోసారి నిరూపించాడు. సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడరు. అలాంటిది అమీర్ ఖాన్ మాత్రం తన ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ అత్యంత స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అంతేనా.. ఏ నిర్ణయం అయినా కూడా వారితో డిస్కస్ చేశాకే తీసుకుంటాడట. ఇక గత కొన్ని రోజులుగా అమీర్ మూడో పెళ్లి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో అమీర్ మూడో వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరగనుందని వార్తలు వినిపిస్తోన్నాయి.

తాజాగా అమీర్ కి సంబంధించిన ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, నెటిజన్ల మైండ్స్ పూర్తిగా బ్లాక్ అయ్యేలా చేస్తోంది. అమీర్ ఖాన్ తన ముగ్గురు భార్యలతో కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. ఒకే కారులో ఆయన ఇద్దరు మాజీ భార్యలతో పాటు, కాబోయే మూడో భార్య కూడా ఉండటం ఇప్పుడు బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

అమీర్ ఖాన్ కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుని ఉండగా, వెనుక సీట్లో ఆయన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు.. కాబోయే బార్య గౌరీ సర్దుకొని కూర్చున్నారు. సాధారణ కుటుంబాల్లో అస్సలు ఊహించలేని ఈ వింత సీన్‌ను అమీర్ ఖాన్ రియాలిటీలో చూపించేసరికి సోషల్ మీడియా వేదికగా మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ముగ్గురు భార్యలను ఒకే కారులో కూర్చోబెట్టి అంత ప్రశాంతంగా ట్రావెల్ చేయడం చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అసలు ఎలా ఇది సాధ్యం. ఒక్క భార్యతోనే వేగడం కష్టం. అలాంటిది.. ఇద్దరు భార్యలు.. అందులో విడాకులు తీసుకున్నకా.. మరో మహిళ తన భర్తని పెళ్లి చేసుకుంటుందని తెలిసినా.. ఆమె మీద కానీ, భర్త మీద కానీ కోపం లేకుండా అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇది కేవలం అమీర్ కి మాత్రమే సాధ్యమైన విషయం.. ఏం గుండె అయ్యా నీది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 05:34 PM