నా భార్య హిందువు కాదు.. లవ్ జిహాద్ పై స్పందించిన అమీర్

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:39 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) మూడో వివాహం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈమధ్యనే అమీర్ తన ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో గౌరీ స్ప్రాట్ ని మూడో వివాహం చేసుకున్నాడు.

Aamir Khan

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) మూడో వివాహం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈమధ్యనే అమీర్ తన ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో గౌరీ స్ప్రాట్ ని మూడో వివాహం చేసుకున్నాడు. ఇక ఈ పెళ్లి తరువాత అమీర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒకపక్క హిందూ రాజకీయ నాయకులు ఇది లవ్ జిహాద్ అని.. ముస్లిం అయిన అమీర్.. హిందూ మహిళలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇంకోపక్క ముస్లిం మత గురువులు గౌరీ స్ప్రాట్ ముస్లిం కానందున షరియా చట్టాల ప్రకారం ఈ పెళ్లి చెల్లదని, ముస్లిమేతర మహిళలను వివాహం చేసుకోవడం నిషిద్ధమని చెప్పుకొచ్చారు.


ఇక తాజాగా ఈ వివాదాలపై అమీర్ స్పందించాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. అసలు తన భార్య గౌరీ స్ప్రాట్ హిందువే కాదని తెలిపాడు. ఆమె ఒక క్రిస్టియన్ అని, గౌరీ స్ప్రాట్ ఎప్పటికీ తన సొంత మతాన్నే పాటిస్తుందని, ఆమెపై మత మార్పిడి ఒత్తిడి ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. కేవలం గౌరీ మాత్రమే కాదు.. మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా మతం మార్చుకోలేదని, తానెప్పుడు వారిని మతం మార్చుకోమని ఫోర్స్ చేయలేదని తెలిపాడు. తమ వివాహాన్ని ముస్లిం పద్ధతిలో కాకుండా చట్టబద్ధమైన రిజిస్టర్డ్ పద్ధతిలో చేసుకున్నామని ఆయన క్లారిటీ ఇచ్చాడు.


తన వైవాహిక జీవితంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. 'మాది చాలా విశాల దృక్పథం ఉన్న కుటుంబం. నా కుటుంబంలో అందరూ హిందువులనే పెళ్లి చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందూ పద్ధతిలోనే ఒక హిందువును వివాహం చేసుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ సమాజం లైఫ్ ని చాలా జోక్ గా తీసుకుంటుందని' చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jul 15 , 2026 | 09:40 PM