Bellam Konda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై.. కేసు నమోదు
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:46 AM
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ (Bellam Konda Suresh) పైకేసు నమోదైంది.
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ (Bellam Konda Suresh) పైకేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్డు నెంబర్.7లో శివప్రసాద్ అనే వ్యాపారి నివాసముంటున్నాడు.
కొన్నిరోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే.. నిర్మాత బెల్లంకొండ సురేష్ అతడి అనుచరులు ఆ ఇంటిని ఆక్రమించేందుకు రెండు రోజుల క్రితం తాళాలు పగలగొట్టడంతో పాటు గోడలు ధ్వంసం చేశారు.
విషయం తెలిసిన వెంటనే వచ్చిన శివప్రసాద్ తన మనుషులను సురేష్ ఇంటికి పంపాడు. వీరిపై సురేష్ దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.