Anchor Udaya Bhanu: ఉదయభాను సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Jan 03 , 2025 | 09:46 AM
బుల్లి తెర యాంకర్లు అప్పుడప్పుడూ వెండి తెరపై సందడి చేస్తుండటం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనసూయ, రష్మీ ఇలా చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
బుల్లి తెర యాంకర్లు అప్పుడప్పుడూ వెండి తెరపై సందడి చేస్తుండటం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనసూయ, రష్మీ ఇలా చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఝాన్సీ యాంకరింగ్ మానేసి నటిగా బిజీ అయిపోయింది. సుమ ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అనసూయ అయితే.. యాంకరింగ్, యాక్టింగ్ ఐటెం సాంగ్స్ ఇలా బిజీగానే ఉంటుంది. ఉదయభాను (Udaya Bhanu) మొదటి నుంచి వెండి తెరపై ఫోకస్ చేస్తూనే ఉంది. కానీ సరైన పాత్ర దక్కలేదు. ఒకట్రెండు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. హీరోయిన్‌గా ప్రయత్నించింది. ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టడానికి సిద్ధమవుతోంధి. విలనీ చూపించడానికి రెడీ అంటోంది. (Udaya Bhanu turn as Villian)
సత్యరాజ్(Satya Raj) ప్రధాన పాత్రలో ‘బార్బరిక్’ (Barbaric movie) అనే సినిమా తెరకెక్కుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మారుతి ఇందులో భాగస్వామి. ఈ చిత్రంలో విలనిజం చూపించబోతోందట. ఉదయ్ భాను పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఈ సినిమాతో తన ఇమేజ్ పూర్తిగా మారబోతోందని ఇన్ సైడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. జనవరి 3న టీజర్ వదలబోతున్నారు. ఈ టీజర్ చూశాక ఉదయభాను పాత్రపై ఓ స్పష్టత రావొచ్చు. బార్బరిక్ తన కెరీర్‌ని ఎటువైపు మలుపు తిప్పుతుందో చూడాలి.