Pushpa Ka Baap: రూ. కోటి సమర్పించుకున్నా.. అల్లు అర్జున్‌లో నో ఛేంజ్..
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:11 PM
రీసెంట్‌గా పూచీ కత్తు పత్రాలు సమర్పించేందుకు కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్‌ని చూసిన వారంతా.. ఆయనలో మార్పు వచ్చిందని అనుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ‘పుష్ప’ మేకోవర్‌కి బై చెప్పి.. సరికొత్తగా కనిపించడంతో.. అల్లు అర్జున్ అంతా తెలుసుకున్నాడనేలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ మరోసారి బన్నీని వివాదంలోకి నెట్టివేసింది.
ఇటీవల సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తీరుని పోలీసులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. నాకేం తెలియదని అల్లు అర్జున్ చెప్పినా, పోలీసులు క్లియర్‌గా ఓ వీడియోను విడుదల చేసి మరీ అల్లు అర్జున్ తీరుని బయటి ప్రపంచానికి చూపించారు. అలాగే ఆ ఘటనలో ఓ మహిళ చనిపోయింది.. ఇంకో కుర్రాడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. నష్ట పరిహారం కింద వారికి రూ. కోటి సమర్పించినా.. అల్లు అర్జున్ యాటిట్యూడ్‌లో మార్పు వచ్చేదే లే అన్నట్లుగా ఉందంటున్నారు తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలు చూసిన వారంతా. విషయంలోకి వస్తే..
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
అల్లు అరవింద్ పుట్టినరోజును పురస్కరించుకుని.. తన తండ్రికి బర్త్ డే విషెస్ చెబుతూ.. ఆయనతో కేక్ కట్ చేయిస్తున్న ఫొటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంది? ఇలాంటి ఫొటోలను షేర్ చేయకూడదనే రూల్ ఏం లేదు కదా? అని అనుకుంటున్నారు కదా! అక్కడే ఉంది మ్యాటర్. తన తండ్రి పుట్టినరోజు, సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.. అంతా బాగానే ఉంది. కానీ కట్ చేసే కేకు మీద ‘పుష్ప కా బాప్’ అని ఉండటమే.. అల్లు అర్జున్‌ని మళ్లీ వార్తలలోకి తెచ్చింది.
‘పుష్ప కా బాప్’ అనే కాదు ‘పుష్ప 2’ సిగ్నేచర్ స్టాంప్ కూడా వేశారు. ఈ ఫొటోలని చూసిన వారంతా అల్లు అర్జున్ పోస్ట్‌కి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక మారవా? ఆ యాటిట్యూడ్ తగ్గించుకోవా? బన్నీలో మార్పు రాలేదు.. ఇలా కామెంట్స్ హోరెత్తుతున్నాయి. రీసెంట్‌గానే అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఆ సమయంలో పూచీ కత్తు పత్రాలు సమర్పించేందుకు కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ పూర్తిగా ‘పుష్ప’ అవతార్‌కి విముక్తి కలిగించి కనిపించారు. కానీ యాటిట్యూడ్‌లో మాత్రం ఇంకా ‘పుష్ప’ మైకంలో నుండి ఆయన బయటికి రాలేదనే విషయం మరోసారి స్పష్టమైందంటూ ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.