Anupam Kher: హార్ట్ టచింగ్ గా తన్వీ ది గ్రేట్ ట్రైలర్
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:57 PM
ఇరవై మూడేళ్ళ తర్వాత అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన సినిమా తన్వీ ది గ్రేట్. గతంలో ఆయన ఓం జయ్ జగదీశ్ మూవీని రూపొందించారు. ఆటిజమ్ గర్ల్ కు సంబంధించిన తన్వీ ది గ్రేట్ మూవీ జూలై 18న విడుదల కానుంది.
జాతీయ ఉత్తమ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) అప్పుడెప్పుడో 'ఓం జయ్ జగదీశ్' (Om Jai Jagadish) మూవీని డైరెక్ట్ చేశారు. మళ్ళీ ఇంతకాలానికి ఆయన 'తన్వీ ది గ్రేట్' (Thanvi The Great) అనే మూవీని రూపొందించారు. ఈ కథను తనను మెగా ఫోన్ పట్టుకునేలా చేసిందని చెబుతున్న అనుపమ్ ఖేర్ ఈ చిత్రాన్ని జూలై 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు.
ఆటిజమ్ తో జీవితాన్ని వెళ్లదీస్తున్న తన్వీ అనే అమ్మాయి తన తల్లి ప్రోద్బలంతో, తాతయ్య సహకారంతో ఆర్మీలో చేరాలనే తన కలను ఎలా సాకారం చేసుకుందనేది ఈ చిత్ర కథ. నూతన నటి శుభాంగి ఈ సినిమాలో టైటిల్ రోల్ ను పోషిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను పల్లవి జోషి (Pallavi Joshi), అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, అరవింద స్వామి తదితరులు చేశారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే... గుండెల్లి ఎవరో పిండేసినట్టుగా అనిపిస్తుంది. ఆర్మీ ఫ్యామిలీకి చెందిన ఆటిస్టిక్ గర్ల్ తన్వీ జర్నీని హృదయానికి హత్తుకునేలా అనుపమ్ ఖేర్ తీశారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఇప్పటికే ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. మరి జూలై 18న జనం ముందుకు వస్తున్న 'తన్వీ ది గ్రేట్'కు భారతీయుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.