Shah Bano Begum: ఆలోచింపచేసేలా 'హక్' ట్రైలర్
ABN, Publish Date - Oct 28 , 2025 | 05:11 PM
భారతదేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన కేసు 'మహ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగమ్ (Shah Bano). సుప్రీమ్ కోర్ట్ ఈ కేసులో ఇచ్చిన తీర్పు పలు రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. కామన్ సివిల్ కోడ్ కు బీజం పడింది కూడా నిజానికి ఇక్కడే. ఆ కేసు ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా 'హక్' (Haq) సుపర్న్ వర్మ (Supern Verma) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యామీ గౌతమ్ (Yami Gautam) బాధిత ముస్లిం మహిళగా నటించగా, ఆమె భర్త పాత్రను ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) చేశారు. నవంబర్ 7న ఈ కోర్ట్ డ్రామా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గత యేడాది 'ఆర్టికల్ 370' మూవీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకున్న యామి గౌతమ్ చేస్తున్న ఈ సినిమా కూడా అదే తరహాలో ఆమెకు పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి. ... ... 'ఆర్టికల్ 370' తర్వాత యామి గౌతమ్ నటించిన మరో సోషల్, పొలిటికల్ కోర్డ్ డ్రామా 'హక్'. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన షా బానో కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
Updated at - Oct 28 , 2025 | 05:11 PM