Uma Telugu Traveller: వాటర్ ప్లాంట్ To కార్పోరేట్ ఆఫీస్! యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ కొత్త జర్నీ
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:59 PM
ఉమా తెలుగు ట్రావెలర్ ఈ పేరు గురించి సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఉమా తెలుగు ట్రావెలర్ (Uma Telugu Traveller) ఈ పేరు గురించి సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పొట్టకూటి కోసం ఆఫ్రికా ఖండంలోని మాలి ఓ చిన్న దేశానికి వెళ్లి అక్కడ వాటర్ ఫ్లాంట్‌లో పని చేస్తూ రోజులు వెళ్లదీసేవాడు. సరిగ్గా కరోనాతో స్థంభించిన జన జీవనం అప్పుడుప్పుడే మాములు స్థితికి వస్తున్న టైం. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఓ రోజు తను ఉండే ప్రాంతాన్ని తెలుగు వారికి చూపించాలనే తాపత్రయంతో తన దగ్గరున్న ఓ సాధారణ మోబైల్‌తో చిన్న వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టడం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్ది ఆ వీడియోలకు ప్రాచుర్యం రావడం అంతకంతకు వ్యూస్ రావడం ఆపై ఫాలోవర్స్ పెరుగుతూ రావడం చకచకా జరిగి పోయాయి.
దీంతో అప్పటివరకు తను చేస్తూ వచ్చిన జాజ్‌కు పుల్‌స్టాప్ పెట్టి ప్రపంచ యాత్ర మొదలు పెట్టి అన్ని దేశాలు తిరుగుతూ వరల్డ్ ట్రావెలర్‌గా కొత్త జీవితం ప్రారంభించాడు. ఈక్రమంలో అతను తిరిగిన దేశాలు అక్కడ అతను అక్కడి ప్రత్యేకతలు ఇతరత్రా విషయాలను చెప్పిన విధానం నెటిజన్లకు విపరీతంగా కనెక్ట్ కావడంతో కొద్ది కాలంలోనే ఇండియా నుంచి ఉన్న టాప్ ట్రావెలర్స్ లో ఒకడిగా ముఖ్యంగా తెలుగు నుంచి ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకున్న ప్రపంచ యాత్రికుడిగా పేరు గడించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 90 దేశాలు చుట్టేసి వచ్చాడు. ఓ వైపు ట్రావెలింగ్ చేస్తూనే పెళ్లి కూడా చేసుకున్న ఉమా ప్రసాద్ భార్యతోనూ రెండు మూడు దేశాలు కలిసి జర్నీ కంటిన్యూ చేశారు. ఆపై ఇద్దరు పిల్లు కూడా పుట్టడంతో తాను ఒకడే నెల రోజులు ఇండియాలో ఉంటూ రెండు నెలలు వివిధ దేశాల పర్యటనలు చేస్తూ వస్తున్నాడు.
అయితే ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన రెండు నెలలుగా ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన ఫాలోవర్స్‌కు షాక్ ఇస్తూ ఓ శుభవార్త తెలిపాడు. తన చెన్నై మిత్రుడు, తమిళ ట్రెక్కర్ (tamiltrekker) బోనితో కలిసి ట్రిప్‌యేట్ (tripate.com) అనే ట్రావెలింగ్ ఆఫీస్ (Travel Offic)ను చెన్నైలో ఆరంభించినట్లు తెలిపాడు. దీని ద్వారా ఔత్సాహికులైన యాత్రికులకు వీసా, పాస్‌పోర్ట్ ఇత్యాది అంశాల్లో సహాయ సాకారాలు అందించడంతో పాటు గ్రూపులుగా ట్రిప్పులకు తీసుకెళ్లనున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఉమా వీడియో ఇప్పుడూ యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అవుతుంది. ఆయన ఫాలోవర్స్, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. వాటర్ ఫ్లాంట్ నుంచి ఇప్పుడు సొంతంగా కార్పోరేట్ ఆఫీస్ వరకు ఆయన జర్నీని ప్రశంసిస్తూ పది మందికి ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. ఇంకా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.