War -2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

ABN , Publish Date - May 20 , 2025 | 11:50 AM

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 'వార్ -2' టీజర్ వచ్చేసింది. ఈ యాక్షన్ మూవీ టీజర్ గూజ్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా 'వార్ -2' (War -2) టీజర్ ను విడుదల చేస్తామని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కేవలం ఎన్టీఆర్ అని మాత్రమే కాదు... 'వార్ -2' మూవీ టీజర్ కోసం అటు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఫ్యాన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరి దాహార్తిని తీర్చుతూ అయన్ ముఖర్జీ (Ayan Mukerji) రూపొందించిన ఈ సినిమా టీజర్ వచ్చింది. 1.32 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లోనూ ఎన్టీఆర్ డామినేషనే కనిపించింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దీనిని విడుదల చేస్తున్నామనే భావనతో కావచ్చు... హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ కే మేకర్స్ ఎక్కువ చోటు కల్పించారు. అలానే కియారా అద్వానీ (Kiara Advani) ఒక్క చోటే అలా మెరపులా మెరిసినా... అది స్విమ్ సూట్ లో కావడంతో... కుర్రకారు కిర్రెక్కి పోతున్నారు. ఇక యాక్షన్ సీన్స్ అయితే... హాలీవుడ్ మూవీస్ ను తలపించేలా ఉంటాయనేది ఈ టీజర్ ను చూస్తుంటే అర్థమౌతోంది.


'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) ఎలా పోటా పోటీగా స్క్రీన్ మీద కనిపించారో... ఇందులో అలా హృతిక్, ఎన్టీఆర్ కనిపిస్తారని అనిపిస్తోంది. దీనికి తోడు... ఈ సినిమాలో వీరిద్దరి మధ్య మొదటి నుండీ టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తుందనేదీ అర్థమైపోతోంది. అప్పుడెప్పుడో తాతయ్య నందమూరి తారక రామారావు దర్శకత్వంలో పిల్లాడిగా 'బహ్మర్షి విశ్వామిత్ర'లో ఎన్టీఆర్ హిందీలో నటించాడు. ఇప్పుడీ సినిమాతో పూర్తి స్థాయిలో యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సోలో హీరోగా అడుగుపెట్టే దానికంటే కూడా ఇలాంటి మల్టీస్టారర్ తో ఎంట్రీ ఇస్తేనే... ఎన్టీఆర్ సత్తా ఏమిటనేది అక్కడి వారికి అర్థమయ్యే ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన 'వార్ -2' టీజర్ అతని ఫ్యాన్స్ కు గ్రాండ్ గ్రిఫ్ట్ అనుకోవచ్చు. ఈ టీజర్ ఇలా వచ్చి రాగానే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి ఉరకలు వేస్తుండటం విశేషం.

Updated Date - May 20 , 2025 | 11:50 AM