Funky Teaser: కాకతీయ మెస్‌లో ఫ్రై తీసుకో, సుబ్బయ్యలో పప్పు తీసుకో
ABN, Publish Date - Oct 10 , 2025 | 09:14 PM
విష్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ (FUNKY). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్.కె.వి దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ కథానాయిక. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
Updated at - Oct 10 , 2025 | 09:14 PM