Premistunna Trailer: వెంకీ అట్లూరి వదిలిన.. ప్రేమిస్తున్నా ట్రైలర్ 

ABN, Publish Date - Oct 31 , 2025 | 11:02 AM

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గ నటించిన చిత్రం 'ప్రేమిస్తున్నా'. భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో  కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ... 'ట్రైలర్ బాగుంది. న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సాత్విక్ వర్మ, ప్రీతీ నేహకు మంచి పేరు రావాలని, దర్శకుడు భానుకు మంచి విజయం రావాలని ఆశిస్తున్నా' అన్నారు.

Updated at - Oct 31 , 2025 | 04:40 PM