Napoleon Returns: అప్పుడు నీడ.. ఇప్పుడు గేదె.. ఆసక్తిగా నెపోలియన్‌ రిటర్న్స్‌ గ్లింప్స్‌

ABN, Publish Date - Oct 26 , 2025 | 01:48 PM

‘నా నీడ పోయింది’ అంటూ ‘నెపోలియన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక, నటుడు ఆనంద్‌ రవి. కొన్నాళ్ల క్రితం చేసిన ఈ ప్రచారం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు.. గేదె దెయ్యం కాన్సెప్టుతో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబందించిన ప్రచారం షురూ చేశారు. ఈ మేరకు ఆదివారం ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నెపోలియన్‌ రిటర్న్స్‌’ (Napoleon Returns) ఖరారు చేశారు. ఇందులో ఆనంద్‌ రవితోపాటు దివి, ఆటో రామ్‌ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ గ్లింప్స్‌ను మీరు చూసేయండి.

Updated at - Oct 26 , 2025 | 01:56 PM