Gopichand33: యోధుడు విప్లవాన్ని రగిలించడానికి..

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:19 PM

గోపీచంద్‌ (Gopichand) హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్‌  నటిస్తున్న 33వ చిత్రమిది. గురువారం హీరో బర్త్‌డే సందర్భంగా టీమ్‌ స్పెషల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో ‘అతడో యోధుడు విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ వీడియోను టీమ్‌ పంచుకుంది.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. 

Updated at - Jun 12 , 2025 | 12:20 PM