Bhairavam: ‘భైరవం’ నుంచి.. కొత్త పాట 'థీమ్ ఆఫ్ గజపతి' రిలీజ్
ABN , Publish Date - May 20 , 2025 | 11:14 PM
మంగళవారం మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా భైరవం సినిమా నుంచి థీమ్ ఆఫ్ గజపతి పాటను మేకర్స్ విడుదల చేశారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల దర్శకుడు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది.
మంగళవారం మంచు మనోజ్ (Manchu Manoj) పుట్టిన రోజు సందర్భంగా భైరవం సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన థీమ్ ఆఫ్ గజపతి పాటను మేకర్స్ విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో శ్రీచరణ్ పాకాల (SriCharan Pakala), మరో గాయకుడు క్రాంతి కిరణ్ తో కలిసి ఆలపించారు.