The Great Pre Wedding Show Teaser: 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'.. టీజర్ విడుదల
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:43 AM
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ టీజర్ విడుదలైంది.
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తిరువీర్ తాజా చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' టీజర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి శేఖర్ కమ్ముల ముఖ్యఅతిథిగా హాజరు కాగా, స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ఈ టీజర్ ను విడుదల చేశారు. టీనా శ్రావ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను సందీప్ ఆగరం, అస్మితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది.