The Family Man S3: మీ నాయన ట్రావెల్ ఏజెంట్ కాదురా నాయనా...
ABN, Publish Date - Nov 07 , 2025 | 02:20 PM
అమెజాన్ ప్రైమ్ లో పాపులర్ వెబ్ సీరిస్ గా గుర్తింపు తెచ్చుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3కి రంగం సిద్థమైంది. ఇప్పుడు శ్రీకాంత్ తివారి దృష్టి ఈశాన్య రాష్ట్రాలలోని డ్రగ్స్ మాఫియాపై పడింది. నవంబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 ట్రైలర్ ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా శ్రీకాంత్ తివారిని ఇంటి సభ్యులు ఆటపట్టించే సంభాషణతో ట్రైలర్ మొదలైంది. తాను ఏజెంట్ అని కొడుక్కి శ్రీకాంత్ చెప్పగానే... ట్రావెల్ ఏజెంటే కదా! అని అతని కొడుకు అమాయకంగా అడగడం ఫన్నీగా అనిపిస్తుంది. చిత్రం ఏమంటే... ఇందులోనూ బోలెడు ట్విస్ట్స్ అండ్ టర్న్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ తివారిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చూపించడం విశేషం. కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 ట్రైలర్ ను మీరూ చూసేయండి.
Updated at - Nov 07 , 2025 | 02:20 PM