Super Star Rajinikanth: దేవా... అడుగుపెడితే విజిలే...
ABN , Publish Date - Aug 02 , 2025 | 07:30 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'కూలీ' ట్రైలర్ విడుదలైంది. ఈ మల్టీస్టారర్ మూవీ ఆగస్ట్ 15న జనం ముందుకు రాబోతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఈ ట్రైలర్ సాగింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా 'కూలీ' ట్రైలర్ వచ్చేసింది. ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఆమీర్ ఖాన్ తో సహా అందరి పాత్రలను రివీల్ చేస్తూ ఈ ట్రైలర్ సాగింది. తన ప్రాణ స్నేహితుడు కోసం కొంత విరామం తర్వాత రంగంలోకి దిగే దేవాగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కళానిధి మారన్ గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను చూసి ఎంజాయ్ చేయండి.