Venkatesh: వెంకటేశ్‌ గురించి సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..

ABN, Publish Date - Dec 13 , 2025 | 10:56 AM

నటుల్లో వెంకటేష్ శైలి వేరు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. శనివారం అయన  65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా  సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా   విషెస్‌ తెలుపుతున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వెంకటేశ్‌కు సంబంధించిన మ్యాష్‌అప్‌ వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన సినిమాల్లోని డైలాగులతో పాటు టాలీవుడ్ హీరోలు వెంకటేశ్‌ గురించి చేసిన కామెంట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. 'సినిమాల్లో ఏదైనా నేర్చుకోవాలంటే నా నుంచి కాదు వెంకటేష్ నుంచి నేర్చుకోండి.. నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతారు' అని ఓ సందర్భంలో కమల్ హాసన్ అన్నారు. నా 45 ఏళ్ళ కెరీర్లో 40 ఏళ్ళు వెంకీతో గడిచాయి. అయన నటించిన 75 సినిమాలు ఒకదానికి ఒకటి పొంతన ఉండదు.. అలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు' అని చిరంజీవి అన్నారు. వెంకటేష్ ఆవకాయ లాంటి వాడని.. ఆయనను ఇష్టపడని తెలుగు ఆడియన్స్‌ ఉండరని నాని అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది 

Updated at - Dec 13 , 2025 | 10:56 AM