Bad Boy Karthik: అమెరికా నుండి వ‌చ్చాను.. ఐటమ్ సాంగ్

ABN , Publish Date - Oct 01 , 2025 | 06:35 PM

నాగశౌర్య తాజా చిత్రం 'బ్యాడ్ బోయ్ కార్తీక్' నుండి ఐటమ్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను స్నేహా గుప్తాపై చిత్రీకరించారు.

Bad Boy Karthik movie

హీరో నాగశౌర్య (Naga Sourya) అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik). ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి (Vidhi) హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలానే ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'నా మావ పిల్లనిత్తానన్నాడే' సాంగ్ కి చక్కని స్పందన లభించిదని మేకర్స్ తెలిపారు. తాజాగా 'అమెరికా నుండి వచ్చాను..' అనే పాటని రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. చంద్రబోస్ (Chandrabose) రాసిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకోవడంతో పాటు చాలా డెప్త్ మీనింగ్ తో వున్నాయి. స్నేహాగుప్తా పై ఈ పాటను చిత్రీకరించారు. చందన బాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ వోకల్స్ సాంగ్ లో మరింత ఎనర్జీ నింపాయి. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.


'బ్యాడ్ బోయ్ కార్తీక్' మూవీలో సముతిర కని, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 07:51 PM