Sitaare Zameen Par: ఆమిర్ మూవీ నుండి కొత్త పాట

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:51 AM

ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'సితారే జమీన్ పర్ ' నుండి మరో పాట విడుదలైంది. ఈ నెల 20న సినిమా విడుదల కావాల్సి ఉంది.

ఆమిర్ ఖాన్ (Aamir Khan), జెనీలియా (Genelia) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par). అయితే ఈ సినిమాకు సెన్సార్ విషయంలో చిక్కులు ఏర్పడ్డాయని, ఇంకా సర్టిఫికెట్ నిర్మాతల చేతికి రాలేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమిర్ ఖాన్ మాత్రం... తన షెడ్యూల్ ప్రకారం మూవీ ప్రమోషన్స్ చేసేస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి 'శుభ మంగళమ్' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ ఫీల్ గుడ్ సాంగ్ కు నెటిజన్స్ నుండి మంచి స్పందనే లభిస్తోంది. ఈ పాటను శంకర్, ఎషాలన్, లాయ్ త్రయం స్వరపర్చగా, శంకర్ మహదేవన్, అమితాబ్ భట్టాచార్య పాడారు. దీనిని అమిగాభ్ భట్టాచార్య నే రాశారు. సౌతిండియన్ వెడ్డింగ్ పార్టీ నేపథ్యంలో ఈ పాట వస్తుంది. దీనిని ఆమిర్ ఖాన్, జెనీలియా, బాస్కెట్ బాల్ టీమ్ పై చిత్రీకరించారు. గతంలో ఆమిర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'తారే జమీన్ పర్'కు సీక్వెల్ గా 'సితారే జమీన్ పర్'ను రూపొందించారు. దివ్యాంగుల ఇతివృత్తంతో బాస్కెట్ బాల్ కాంపిటీషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని సెన్సిబుల్ సీన్స్ కారణంగా సెన్సార్ అభ్యంతరాలను ఎదుర్కొంటోందని సమాచారం. ఇందులో ఆమిర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్ గా నటించాడు. ఆర్.ఎస్. ప్రసన్న ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

Updated Date - Jun 17 , 2025 | 09:51 AM