Shree Nandu: సైకిక్ కుర్రాడి కథతో 'సైక్ సిద్ధార్థ'...
ABN, Publish Date - Dec 02 , 2025 | 04:09 PM
నందు (Nandu) హీరోగా వరుణ్ రెడ్డి (Varun Reddy) తెరకెక్కించిన సినిమా 'సైక్ సిద్ధార్థ' (Psych Siddhartha). శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి కలిసి నిర్మించిన ఈ మ్యాడ్ మాక్స్ స్టైల్ మ్యాడ్ నెస్ యూత్ ఫుత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను సురేశ్ బాబు దగ్గుబాటి (Suresh Babu Daggubati) విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 12న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు స్మరన్ సాయి మ్యూజిక్ డైరెక్టర్. హీరో శ్రీనందు ఈ మూవీకి ఎడిషనల్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
Updated at - Dec 02 , 2025 | 04:10 PM