K. K. Radhamohan: శర్వానంద్, సంపత్ నంది భోగి

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:34 PM

శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. దీనికి 'భోగి' అనే టైటిల్ ఖరారు చేశారు.

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) కాంబినేషన్ లో కె. కె. రాధామోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ఖరారైంది. 1960 బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాకు 'భోగి' (Bhoogi) అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇది సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉంది. దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను నరేట్ చేస్తుండగా ఈ వీడియో సినిమా ఎసెన్స్ చూపిస్తుంది. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా 'భోగి' టైటిల్ రివిల్ అవుతుంది. ఈ టైటిల్ కొత్త శక్తి, తిరుగుబాటును ప్రజెంట్ చేస్తోంది. వీడియోలో ప్రజెంట్ చేసినట్లుగా శర్వా నెవర్ బిఫోర్ పాత్రలోకి అడుగుపెడుతున్నారు.


ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్ లో ప్రారంభమైయింది. వీటిలో కొన్ని భాగాలను కాన్సెప్ట్ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ విజన్ ని జీవం పోయడానికి ప్రొడక్షన్ టీం ఆరు నెలలు డెడికేషన్ తో వర్క్ చేసి, దాదాపు 20 ఎకరాల భూమిని బ్రెత్ టేకింగ్ బ్యాక్ డ్రాప్ గా మార్చింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 1960ల ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో 'భోగి' టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని రాధామోహన్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Also Read: Balakrishna- Sunny Deol : బాలయ్య తో సన్నీడియోల్ ఢీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 30 , 2025 | 04:34 PM