Ram Charan: 'పెద్ది' ఫస్ట్ షాట్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీం రీ క్రియేషన్

ABN , Publish Date - May 05 , 2025 | 05:27 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇటీవల విడుదలైన ఫస్ట్‌ షాట్‌కు విశేష ఆదరణ దక్కింది. ఇప్పుడీ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రీ క్రియేట్‌ చేసింది. నేడు ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ వీడియోను పంచుకున్నారు. దీనిపై రామ్‌చరణ్‌ స్పందించారు. తమ వీడియోను అద్భుతంగా రీక్రియేట్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, టీమ్‌కు విషెస్ చెప్పారు.

Updated Date - May 05 , 2025 | 05:43 PM